navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 1:53 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విద్యార్థుల భవిష్యత్తుకు మ్యాతమెటీక్స్ మెటీరియల్ ఎంతో ఉపయోగకరం

జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము

నవగీతం, జగిత్యాల

విద్యార్థుల భవిష్యత్తుకు తెలంగాణ మ్యాతమెటీక్స్ ఫోరం జగిత్యాల జిల్లా రిసోర్స్ టీమ్ రూపొందించిన మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారి కే. రాము అన్నారు.జగిత్యాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎస్సేసి 2025–26 పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం (TMF) జగిత్యాల జిల్లా రిసోర్స్ టీం రూపొందించిన మ్యాతమేటిక్స్ టీచర్స్ సపోర్ట్ గ్రూప్ స్టూడెంట్ మెటీరియల్ ను శనివారం డీఈఓ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము , ఏ ఏం ఓ చంద్రశేఖర్ రెడ్డి ,డీసీఈబీ కార్యదర్శి మురళీమనోహర చారి, డిసిఈబీ అసిస్టెంట్ సెక్రటరీ హాజరయ్యారు.ఈ సందర్భంగా డిఈఓ రాము మాట్లాడుతూ టీచర్ సపోర్ట్ గ్రూప్ విద్యార్థులు గణితంలో భయాన్ని తొలగించి ధైర్యంగా పరీక్షలు రాయడానికి ఈ మెటీరియల్ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ అధ్యయన సామగ్రి ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా, విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా రూపొందించబడిందన్నారు.ఈ కార్యక్రమంలో టీ ఎం ఎఫ్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు వి. శ్రీకాంత్ , ప్రధాన కార్యదర్శి బస రాజగోపాల్ , ఆర్థిక కార్యదర్శి ఎం. లక్ష్మీకాంత్ , వి వి.వెంకటస్వామి , అశోక్ ఎర్రబెల్లి సభ్యులు టి. శ్రీనివాస్, ప్రవీణ్, వేణు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ మెటీరియల్‌ను సమర్థవంతంగా అమలు చేసి వంద శాతం ఫలితాలు సాధించాలని వక్తలు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లాలో గణిత ఫలితాల మెరుగుదలకు ఒక మైలురాయిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు