చైర్మన్ డాక్టర్ రఘు
కోరుట్లలో నిత్యసాయి ట్రస్ట్ కార్యాలయం ప్రారంభం
నవగీతం,కోరుట్ల
పేద ప్రజలకు విద్య, వైద్యం, ఆర్థిక సహాయమే లక్ష్యంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలో సేవా రంగానికి మరో మైలురాయిగా నిలిచేలా నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ప్రారంభమైంది. పట్టణంలోని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయాన్ని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ సమాజంలో విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వడమే ఈ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. గత 23 సంవత్సరాలుగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించే ప్రణాళికతో ముందుకెళుతున్నామని తెలిపారు. ట్రస్ట్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ట్రస్ట్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని ట్రస్ట్ సేవా కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కోరుట్ల పట్టణంలో సేవాభావంతో ముందుకు సాగుతున్న ఈ ట్రస్ట్ భవిష్యత్తులో మరింత విస్తృతంగా ప్రజలకు సేవలు అందిస్తుందనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు న్యాయవాది ఏలేటి నరేందర్ రెడ్డి, చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, బొడ్ల రమేష్, తిప్పిరి గంగాధర్, తిప్పిరి సుమ, వినిత తదితరులు పాల్గొన్నారు.