నవగీతం,కొడిమ్యాల
కొడిమ్యాల మండల కేంద్రంలోని విన్నర్స్ ఇంగ్లీష్ స్కూల్‌లో దేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, భారత రాజ్యాంగ ప్రాముఖ్యతపై విద్యార్థులు చేసిన ప్రసంగాలు అందరినీ ఆలోచింపజేశాయి.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అరవింద్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో, దేశభక్తితో పాటు బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని, దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని ఆయన తెలిపారు.