టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాస రావు
నవగీతం,జగిత్యాల
జగిత్యాల విలేఖరుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పని చేస్తామని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాస రావు అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత సమావేశాల్లో చర్చించిన పలు సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. కార్యవర్గ సభ్యులందరూ సమిష్టిగా కృషి చేసి యూనియన్ బలోపేతానికి సహకరించాలన్నారు.జిల్లాలో ప్రతి సభ్యుడికి ఐడి కార్డులు ఇవ్వడంలో కొంత వరకు జాప్యం జరిగిందన్నారు. జిల్లాలో నూతన సభ్యత్వాలు వేగవంతంగా పూర్తి చేసిన తర్వాత ఐడి కార్డులు అందజేస్తామని వివరించారు. నూతన సభ్యత్వాలు మెట్ పల్లి రాయికల్, జగిత్యాల నుండి మాత్రమే వచ్చాయని మిగతా మండలాల నుండి కూడా అర్హత గల ప్రతి జర్నలిస్ట్ కు సభ్యత్వం ఇప్పించే విధంగా చూడాల్సిన బాధ్యత కార్యవర్గ సభ్యులందరిపై ఉందని అభిప్రాయపడ్డారు. నూతన కార్యవర్గం ఎన్నికై 6 నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని మండలాల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించలేకపోయామన్నారు. ఇక నుండి వారానికి ఒక మండలంలో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.యూనియన్ లో ప్రాతినిత్యం లేని మండలాల నుండి జిల్లా కమిటీలో, అనుబంధ కమిటీల్లో తీసుకుని యూనియన్ ను మరింత పటిష్ట పరుస్తామన్నారు. కొన్ని మండలాల ప్రెస్ క్లబ్ లో సమన్వయ లోపంతో చిన్నచిన్న విబేధాలు ఉన్నాయని,జిల్లా నుండి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లాలోని జర్నలిస్టు కుటుంబ సభ్యులకోసం హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అందరు సహకరిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. నూతన సభ్యత్వాలు త్వరగా పూర్తి చేసుకుంటే భీమా కంపెనీతో మాట్లాడి ప్రతి సభ్యునికి భీమా వర్తింపజేయనున్నట్టు చెప్పారు. అలాగే గడువు ముగిసిన మండలాల ప్రెస్ క్లబ్ లకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఇతర యూనియన్ వారు మన యూనియన్ కు వస్తే వారికి సభ్యత్వం కల్పిస్తామన్నారు. అనంతరం ఎంఐఎం జిల్లా అధ్యక్షునిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన లియాఖత్ అలీ మొహాసిన్ టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణి చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాడానికి సహకరించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలు ఎంఐఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకువెళ్లి సిఎం ద్వారా పరిష్కారం అయ్యేలా చూడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగుల గోపాల్ చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరి కృష్ణ, హైదర్ అలీ, అల్లే రాము, కోశాధికారి సిరిసిల్ల వేణు గోపాల్, సహాయ కార్యదర్శులు గుర్రం చంద్ర శేఖర్, కోరేపు రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు మధు సుధన్, రాజేష్, రఘుపతి రెడ్డి, రాజిరెడ్డి, సాకేత, పవిత్ర, కాజా జమీర్ అలీ, శమ్ము గౌస్, సాజిద్, మనోజ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.