నవగీతం,కోడీమ్యాల
కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ, వివేకానంద జయంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొడిమ్యాలలోని వివిధ పాఠశాలల విద్యార్థులు అందంగా, సంక్రాంతి పండుగ ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జనవరి 12న జరిగే వివేకానంద జయంతి రోజున ప్రధమ, ద్వితీయ ,తృతీయ బహుమతులను పాల్గొన్న వారి అందరికీ కన్సోలేసన్ బహుమతులు అందజేస్తామని వివేకానంద సేవా సమితి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి, ముగ్గుల పోటీ న్యాయ నిర్నేతలుగా మహిళా సంఘం అధ్యక్షులు సంద పద్మ, అంగన్వాడి టీచర్ బోయిని సుజాత, వివేకానంద సేవ సమితి అధ్యక్షులు గంగాచారి ,సభ్యులు శ్రీనివాస్, రామచంద్రం, సురేష్, గ్రామస్తులు, యువకులు, మహిళలు ,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.