navageetam.com
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 1:54 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వైరా మున్సిపల్ చైర్ పర్సన్ బరిలో ఎడ్లపల్లి వనజ

నవగీతం,వైరా:

వైరా మున్సిపల్ చైర్ పర్సన్ రేసులో ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్లపల్లి వీరయ్య చౌదరి సతీమణి ఎడ్లపల్లి వనజ చైర్పర్సన్ బరిలో ఉన్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా వనజ పని చేశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో చురుకైనా నాయకత్వ లక్షణం కలిగిన వనజ గడచిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ విజయం కోసం ఆమె ఎంతో కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె భర్త అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తమ వంతు పాత్ర వహించారు. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో మధిర వైరా నియోజక వర్గాలో ఆమె పాల్గొన్నారు. మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువాళ్ల  దుర్గాప్రసాద్ ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. విద్యావంతురాలు అయిన వనజ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి మున్సిపల్ బరిలో ఉంటే అభివృద్ధి మరింతగా ముందుకు సాగుతుందని పలువురు తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మల్లు భట్టి విక్రమార్క కుటుంబానికి దగ్గరగా ఉన్న వనజ రాజకీయ ప్రాధాన్యత కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది