navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 3:18 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వైరా మున్సిపాలిటీలో నెలకొన్న ఉత్కంఠకు తెర

వైరా మున్సిపాలిటీలో కలిసి పోటీ చేయనున్న సిపిఐ(ఎం), బిఆర్ఎస్

నవగీతం, వైరా

వైరా మున్సిపాలిటీ ఎన్నికల గురించి గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. త్వరలో జరగనున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్, సిపిఐ(ఎం) పార్టీల పొత్తు ఖరారైంది. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో వైరా మున్సిపాలిటీలో సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆదివారం జరిగిన చర్చల్లో సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీల మధ్య ఈ మేరకు అవగాహన కుదిరింది. ఆదివారం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సిపిఐ(ఎం), బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, పట్టణ నాయకులు బొంతు సమత, కొంగర సుధాకర్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు మద్దెల రవి ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో వైరా మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో బిఆర్ఎస్, సిపిఐ(ఎం) పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ(ఎం), బిఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా ఐక్యంగా సైనికుల్లా పనిచేసి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదరడంతో రానున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికలు పోటాపోటీగా జరగనున్నాయి. ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మాదినేని దుర్గాప్రసాద్, కొత్త వెంకటేశ్వరరావు, ఏదునూరి శ్రీను, దొంతబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.