అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్
నవగీతం,వైరా
వైరా మండల కేంద్రంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత పుట్టినరోజు వేడుకలను జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఖమ్మం జిల్లా ఇంచార్జ్ గ్రంథి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు అనంతరం వైరాలోని ఆర్టీసీ బస్టాండ్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కల్వ సుజాత నిండా నూరేళ్లు నిండు జీవితాన్ని గడిపి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం చేపట్టటం మంచి కార్యక్రమం అని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం కల్వ సుజాత పుట్టినరోజు సందర్భంగా 10 కేజీల కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు కొణిజర్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే నారాయణ మాజీ సర్పంచ్ సూరంపల్లి రామారావు మిట్టపల్లి నాగి మిట్టపల్లి శ్రీనివాసరావు వాసవి క్లబ్ వైభవం వైరా అద్యక్షులు జివివి రవికుమార్ సెక్రటరీ జి చరణ్ కుమార్ ట్రెజరర్ బండారు కృష్ణారావు జిల్లా అధికారి రాయల నాగేశ్వరరావు జిల్లా బాధ్యులు తాటికొండ రాము ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు మైలవరపు శ్రీనివాసరావు అనుమోలు భాస్కరరావు అనుమోలు ప్రభాకర్ రావు అనుమోలు శ్రీనివాసరావు గుండెల శరన్ చలపతిఆత్మకూరు శేషగిరిరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.