నవగీతం, జగిత్యాల
గత వేసవి సెలవులలో కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ పొందిన టీచర్లకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బోయినిపెల్లి ఆనందరావు, యాళ్ల అమర్నాథ్ రెడ్డిలు కోరారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాము కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
గత వేసవి సెలవులలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విషయాల వారి గా ఐదు రోజుల కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ తరగతులు నిర్వహించారన్నారు. ఈ శిక్షణా తరగతులలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రిసోర్స్ పర్సన్ లకు థామాషా పద్ధతిలో సంపాదిత సెలవులు మంజూరు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాము ను కోరారు. వీరివెంట రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వూటూరి మహేశ్ ఉన్నారు.