నవగీతం, హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి దిశగా జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ ఆలోచన సిద్ధాంతలకు పనిచేయాలని అనుకుంటున్న నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో చేరడానికి స్వాగతం తెలుపుతున్నాము అని
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ నుండి డా. మాధవ్ రెడ్డి , డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ సాహూ , ఆధ్వర్యంలో పలు నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ ఎన్. శంకర్ గౌడ్ స్వాగతించారు. త్వరలోనే శేరిలింగంపల్లి నుండి మరి కొన్ని పార్టీ చేరికలు ఉండబోతున్నాయని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తల్లూరి , పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బి. మహేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ ఎన్. శంకర్ గౌడ్ , ప్రచార కార్యదర్శి ఆర్.కె. సాగర్ కుకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ కుమార్ రాష్ట్ర నాయకులు రాజలింగం, దామోదర్ రెడ్డి, సంపత్ నాయక్ ఇతర రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.