శ్రమ గొంతుగా మారిన కవిత్వం — దాతి
పుస్తక పరిచయ కర్త గాజోజి శ్రీనివాస్ నవగీతం,హైదరాబాద్ దాసోజు లలిత గారి కవిత్వం శ్రమజీవి జీవితాన్ని దూరం నుంచి చూసే రచన కాదు; ఆ జీవితాల మధ్య నుంచే పుట్టిన అనుభవ స్వరం. ఈ కవితల్లో శ్రమ దయ కోరే అంశంగా కాక, సమాజాన్ని నడిపే ప్రధాన శక్తిగా సహజంగా ప్రతిఫలిస్తుంది. దాతి, కొలిమి, రాట్నం, గురిగింజ వంటి పనిముట్టులు ఇక్కడ కేవలం రూపకాలుగా కాక, తరతరాల జీవన జ్ఞానం, విలువలు, చరిత్రను మోసిన నిజమైన జీవితాలు కనిపిస్తాయి. గ్రామీణ భాష, స్థానిక బింబాల...