navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 12:53 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

శ్రీవారి చక్రస్థానంలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు

ఆనవాయితీగా గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం

నవగీతం,మల్లాపూర్

రాష్ట్ర ప్రభుత్వ నుండి రానున్న గోదావరి పుష్కరాలకు అత్యధికంగా కోరుట్ల నియోజకవర్గంకు నిధులు కేటాయించేలా కృషి చేస్తానని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం మల్లాపూర్ మండలంలోని కొత్త దాంరాజ్ పల్లి గోదావరినది తీరంలో నిర్వహించిన శ్రీవారి చక్రస్నానం కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు.ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ధనుర్మాస ఆరంభం నుండి కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనాదిగా శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈఉత్సవాలలో భాగంగా చివరి రోజు కోరుట్ల ఆలయం నుండి మల్లాపూర్ మండలంలోని కొత్త దామరాజు పల్లి గ్రామ సమీపంలో ఉన్న గోదావరి నదిలో శ్రీవారి సుదర్శన చక్రానికి చక్రస్నానం ఘనంగా నిర్వహించడం అనవాయితీగా వస్తున్నది ఈ ఆనవాయితీ లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జువ్వడి కృష్ణారావు తో పాటు వెంకటేశ్వ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు యతి రాజం నరసయ్య ఆలయ ధర్మకర్తలు నేతి శ్రీనివాస్ కటకం దివాకర్ కోట గంగాధర్ గోడికే రాములు చిలివేరి విజయ్ పద్మ ఈవో విక్రం ఆలయ ప్రధాన అర్చకులు బీ ర్నంది నరసింహాచారి దామరాజ్ పల్లి గ్రామ ప్రజలు భక్తులు కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది , భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు