navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 3:23 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్న మారిషస్ అధ్యక్షుడు

నవగీతం, తిరుపతి

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోగుల్ మంగళవారం సాయంత్రం తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న మారిషస్ అధ్యక్షుడికి టిటిడి జేఈవో  వి.వీరబ్రహ్మం సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం పూర్తయ్యాక  ధరమ్ బీర్ గోగుల్ కి టిటిడి జేఈవో తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్వో కె.వి.మురళీకృష్ణ, పలువురు టిటిడి అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.