విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రవతి
నవగీతం, వైరా
సంక్రాంతి పర్వదినాన ప్రతి ఒక్క కుటుంబంలో ఆనంద డోలికలు వర్ధిల్లాలని వైరా మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ బానోత్ చంద్రవతి అన్నారు బుధవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం హనుమాన్ బజార్ లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వైరా మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ భాను చంద్రావతి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని అందరికీ దేవదేవుడు అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రవికుమార్ మందరపు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.