సంక్రాంతి పండుగ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక

ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు ప్రధానం నవగీతం జగిత్యాల తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో సుమన్ టీవీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసి ఆమె మాట్లాడుతూ సంస్కృతిని ప్రేమిస్తూ ముందు తరాలకు అందించడం మనందరి బాధ్యత అన్నారు. సంక్రాంతి పండుగను మరింత అందంగా మలిచేది ముగ్గులేనని అన్నారు.ఈ కార్యక్రమంలో జువ్వడి కృష్ణారావు, ఇందూరు సత్యం...