navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 12:27 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సంగారెడ్డి ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

నవగీతం,సంగారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఇక జీవితంలో పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలో తన భార్య నిర్మల పోటీ చేసినా తాను ప్రచారానికి రానన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేస్తాకానీ, సంగారెడ్డిలో మాత్రం ప్రచారం చేయనని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ ప్రచారం చేసినా తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓటమికి పేదలు కారణం కాదని, ఇక్కడి మేధావులు, పెద్దలు అన్నారు. సంగారెడ్డిలో ఓటమి తన జీవితంలో మరిచిపోలేనిదని పేర్కొన్నారు.