సన్నధాన్యం రకాలు, వాటి సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి.జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

నవగీతం, జగిత్యాల సన్నధాన్యం సాగు ద్వారా రైతులకు ప్రభుత్వ బోనస్ కాకుండా మంచి నాణ్యతతో పాటు మెరుగైన మార్కెట్ ధరలు పొందే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, టీజీ సీడ్స్ డీఎం, ఆర్‌ఎం, పొలాస శాస్త్రవేత్తలు, వివిధ విత్తన ప్లాంట్ల ప్రతినిధులు విత్తన పంపిణీదారులు...