navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 2:00 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సర్పంచ్ ల ఫోరం కార్యవర్గం ఎన్నిక..

నవగీతం, భీంగల్

భీంగల్ మండలం సర్పంచ్ ఫోరం కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఫోరం మండల అధ్యక్షులుగా పిప్రి సర్పంచ్ అరిగేల జనార్దన్, ఉపాధ్యక్షులుగా సికింద్రాపూర్ తండా భూక్యా రమేష్, ప్రధాన కార్యదర్శిగా పల్లికొండ సర్పంచ్ పిండి అశోక్, కార్యదర్శిగా చేంగల్ సర్పంచ్ దుమాల రాజు, కోశాధికారి గా బాబాపూర్ సర్పంచ్ సమీర్ గౌరవ అధ్యక్షులుగా బాబానగర్, పురానిపేట్ సర్పంచ్ లు శ్రీరాం అరవింద్, బుర్ర దేవేందర్ గౌడ్ లను ఎన్నుకున్నారు. ఎన్నికైన కోరం సభ్యులు సర్పంచ్ ల సంక్షేమం, హక్కుల కొరకు పోరాటం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాల సర్పంచ్ లు వన్నెల జనార్దన్, చరణ్ గౌడ్, గడాల ప్రసాద్, కార్తీక్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.