సహస్ర లింగాల దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు
నవగీతం,జగిత్యాల జగిత్యాల రూరల్ పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని గణనాథునికి పలు పంచామృతాభిషేకాలు భక్తుల సహస్తాలతో నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి గరిక మాలతో స్వామివారిని అలంకరించారు. అనంతరం స్వామివారికి మంగళ హారతులను నక్షత్ర హారతిని సమర్పించారు. ఈ పూజా కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వేదమంతో చాలా మద్య నిర్వహించారు అనంతరం భక్తులు గణనాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు విచ్చేసిన...