navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 1:25 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సిరికొండలో ఘనంగా మల్లన్న పట్నాలు

వగీతం, కథలాపూర్

కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో మల్లన్న పట్నాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో ముఖ్యంగా యాదవుల కుల దైవమైన మల్లన్న స్వామిని పూజించి భక్తిశ్రద్దలతో చేసే సంప్రదాయ పండుగ. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి, బోనాలు సమర్పించి, డప్పుచప్పుళ్లతో, ఒగ్గు కథలతో స్వామివారిని కొలిచారు. పెద్దపట్నం, మైల పట్నం వేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామి వారిని కోరుకున్నారు.తెలంగాణ సంస్కృతి లో మల్లన్న పట్నాల పండుగ ముఖ్యమైనదని భక్తులు తెలిపారు.