navageetam.com
Newspaper Banner
Date of Publish : 15 January 2026, 6:28 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సీఎం కి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించిన టిటిడి ఈవో

నవగీతం,తిరుపతి

సంక్రాంతి పండుగని పురస్కరించుకుని నారావారిపల్లెలోని ముఖ్యమంత్రి నివాస గృహంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి గురువారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అడిషనల్ ఈవో  సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు  జి.భానుప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్  వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ  ఎల్ సుబ్బారాయుడు, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కేవీ మురళీకృష్ణ, వేదపండితులు పాల్గొన్నారు.