navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 8:53 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సురేష్ ఆత్మరామ్ మహారాజ్‌కు భక్తులు ఘన స్వాగతం

నవగీతం,కొడిమ్యాల:

కొడిమ్యాల మల్యాల మండలం కొండగట్టు అంజన్న క్షేత్రంలో గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు చిలుకూరు బాలాజీ దేవాలయ శివాలయ ప్రధాన అర్చకులు శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ బుధవారం కొడిమ్యాల మండల కేంద్రంలో పర్యటించారు. కొడిమ్యాలకు చెందిన భక్తుడు చెన్న దేవేందర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన వారి గృహానికి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన గురువుగారికి దేవేందర్ కుటుంబ సభ్యులు గ్రామ భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తులు మహారాజ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, పూలమాలలు వేసి ఆశీస్సులు తీసుకున్నారు. తమ విన్నపాన్ని మన్నించి ఇంటికి విచ్చేసినందుకు భక్తులు స్వామివారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా సురేష్ ఆత్మరామ్ మహారాజ్ భక్తులను ఆశీర్వదిస్తూ ధర్మ మార్గంలో నడవాలని, నిత్యం దైవ స్మరణతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని హితబోధ చేశారు. కొండగట్టు గిరి ప్రదక్షిణ విశిష్టతను వివరించి, భక్తి మార్గంలో కొనసాగాలని సూచించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు చెన్న దేవేందర్, సతీష్ రావు, నరసయ్య, శ్రీనివాస్, అంజయ్య తో పాటు భక్తులు పాల్గొన్నారు.