2026లో పెళ్లిళ్లకు అద్భుతమైన ముహూర్తాలు ఇవే..!!

నవగీతం,హైదరాబాద్ కొత్త సంవత్సరం వచ్చింది. పెళ్లి కానివారంతా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెడతారు. ఇంట్లో పెద్దలు కూడా పెళ్లీడు వచ్చిన పిల్లలకు సంబంధాలు చూడటం మొదలుపెడతారు. మరికొందరు కొంత ముందుగా నిశ్చితార్థాలు పెట్టుకున్నవారుంటారు. వారంతా కొంత సమయం తీసుకొని పెళ్లి చేసుకుందామనుకుంటారు. అందుకు తగినట్లుగా 2026 సంవత్సరం మొత్తం మంచి పెళ్లి ముహూర్తాలు ఎన్ని ఉన్నాయి? అనే వివరాలను తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం గురువు, శుక్రుడు ముహూర్తాలకు కారకులు. ఈ రెండు సూర్యుడితో కలుస్తుండటంతో మౌఢ్యమి అవుతుంది. జనవరిలో ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 14 తర్వాతే...