navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 12:27 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అంకితభావానికి మరో పేరు డాక్టర్ అంజిత్ రెడ్డి

నవగీతం, మెట్ పల్లి రూరల్:

మెట్‌పల్లి మండల వైద్యాధికారి డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి జగ్గాసాగర్ గ్రామంలో ప్రజల వద్దకు వైద్యాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజలకు అవసరమైన నివారణ చర్యలు చేపడుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ వైద్య సిబ్బందిని నిత్యం అప్రమత్తం చేస్తున్నారు. లెగ్మెంట్ ఇంజురీతో నడవలేని స్థితిలో ఉన్న యువకుడు డాకూరి వెంకటేష్ కు వారి ఇంటి వద్దకు వైద్యాన్ని చేర్చి ఆరోగ్య పరిస్థితి పరిశీలించారు. మెట్‌పల్లి మండల వైద్యాధికారి డాక్టర్ఎల్లాల అంజిత్ రెడ్డి అంకిత భావాన్ని గ్రామస్థులు హర్షిస్తున్నారు.