నవగీతం మల్లాపూర్:
పిల్లలు పెరుగుతున్న సమయంలో వారికి సరైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం చాలా ముఖ్యం అని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రం లో అంగన్వాడి సెంటర్-5 లో 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ,బాలింతలకు అంగన్ వాడి పోషకాహారాన్ని బాలామృతాన్ని, కోడిగుడ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పిల్లలు పెరుగుతున్న సమయంలో వారికి సరైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం చాలా ముఖ్యం అని చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తోందని సరైన మోతాదులో అందించి పిల్లలను ఆరోగ్యవంతులుగా చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, అంగన్వాడీ టీచర్ ఇందిర, వార్డు సభ్యులు అల్లె లత, ముత్యాల గంగ రాజం, భుక్యా శేఖర్, అల్లె చంద్రయ్య, ముష్కరి రమేష్ ,ఏనుగువెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు