అంతర్రాష్ట్ర మార్కెట్ల సందర్శన

చిత్తూరు,మధురై మామిడి మార్కెట్‌ను పరిశీలించిన పెద్దపల్లి మార్కెట్ కమిటీ సభ్యులు అత్యాధునిక విధానాలపై అధ్యయనం నవగీతం,పెద్దపల్లి: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఇతర ప్రాంతాల్లోని మార్కెటింగ్ విధానాలను,అత్యాధునిక సౌకర్యాలను అధ్యయనం చేయడానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టింది. ఈ పర్యటనలో భాగంగా బృందం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు మామిడి మార్కెట్‌ను మరియు తమిళనాడులోని మధురై స్మార్ట్ ఫ్రూట్ మార్కెట్‌ను సందర్శించింది.మొదటగా చిత్తూరులోని వ్యవసాయ మార్కెట్ ను సందర్శించిన పాలకవర్గ సభ్యులు,అక్కడ మామిడి క్రయవిక్రయాలు జరిగే...