navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 6:12 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అంబేద్కర్ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అమోఘం

జేడీ డాక్టర్ రాజేందర్ రెడ్డి

నవగీతం, మెట్ పల్లి:

ఈ నెల 17 వ తేదీ నుంచి ప్రారంభమైన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి కితాబిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల-అంబేద్కర్ అధ్యయన కేంద్రాన్ని (46) ఆదివారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ l,రెగ్యులర్ పరీక్షల మాదిరి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలను నిర్వహిస్తున్నారని,అందువల్ల విద్యార్థులకు విద్యా ప్రమాణాలు పెరగడంతో పాటు పోటీ పరీక్షలలో పాల్గొనడానికి అవకాశం ఉందని అన్నారు. ఈ అధ్యయన కేంద్రంలో పరీక్షల నిర్వహణ పటిష్టంగా ఉందని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు క్రమ శిక్షణతో మెలుగుతున్నారని, రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగా పరీక్షలు రాస్తున్నారని ఆయన కొనియాడారు.పరీక్షల నిర్వహణ పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య, కళాశాల అంబేద్కర్ కో – ఆర్డినేటర్ బిల్ల రాజేందర్ లను జేడీ డాక్టర్ రాజేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈయన వెంట సిబ్బంది కొమురయ్య , కళాశాల పరీక్షా కేంద్రం పరిశీలకులు సత్యనారాయణ , సిబ్బంది తదితరులు ఉన్నారు.