navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 4:57 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అభివృద్ధి కావాలా.. అవినీతి కావాలా..??

అభివృద్ధి, సంక్షేమం అంటే బీజేపీకే ఓటేయండి

మెట్ పల్లిలో బీజేపీ కార్నర్ మీటింగ్స్ సక్సెస్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి :

అభివృద్ధి కావాలంటే బీజేపీకే ప్రజలు ఓటేసి ఆదరించాలని బీజేపీ నేతలు పేర్కొన్నారు. మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో పట్టణంలోని 13, 21, 22వ వార్డుల్లో గల ఎస్సారెస్పీ ఫంక్షన్ హాల్ సమీపంలో 19, 23, 24, 26వ వార్డుల్లో అంగడి బజార్ లలో సాయంత్రం 7 నుంచి 8 వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో అన్ని వార్డుల నుండి వేలాది సంఖ్యలో ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు మాట్లాడుతూ మెట్ పల్లిని స్మార్ట్ సిటీగా మారుస్తానని ఎంపీ అరవింద్ అన్న హామీ ఇచ్చారు. మున్సిపల్ లో బీజేపీని గెలిపిస్తే స్మార్ట్ సిటీ కల సాకారం కానుందన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని మెట్ పల్లి హిందూ స్మశాన వాటికకు రూ. కోటి నిధులు మంజూరు కాగా వాటిని అభివృద్ధికి వాడుకోకుండా మాయం చేసిన ఘనత ప్రస్తుత పాలకులకే దక్కిందన్నారు. కానీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు బోర్డును తీసుకొచ్చారు. చైర్మన్ గా ఇక్కడి మనిషినే నియామకం చేశారు. పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నవోదయ పాఠశాలను కోరుట్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేయడంలో ఎంపీ అరవింద్ ఎంతో కృషి చేశారన్నారు. మున్సిపల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలంటే అవినీతి రహిత పాలన అందించే బీజేపీనే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు , జిల్లా ఇంచార్జీ శ్రీనివాస్ గౌడ్ , మెట్ పల్లి ఎన్నికల ఇంచార్జీ రాజేష్ , బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మీ, వేంపల్లి సర్పంచ్ రాజేందర్ నాయక్, నాయకులు పోలీస్ శ్రీనివాస్, గోపిడి శ్రీనివాస్,  తొగిటి రమేష్ తో పాటు జోనల్, వార్డు ఇంచార్జ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.