పూరపోరు రంగంలోకి 26 మంది సింహాలు
ఫార్వర్డ్ బ్లాక్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్
నవగీతం,పెద్దపల్లి:
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి భవిష్యత్తును మార్చే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ,అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెద్దపల్లిలో అధికార పార్టీ తప్పులను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు,తమ స్వలాభం కోసం అధికార పార్టీతో చేతులు కొలిపాక శ్రీనివాస్ ఆరోపించారు.గత రెండేళ్లుగా పెద్దపల్లిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని,కేవలం శిలాఫలకాల ప్రారంభోత్సవాలకే పాలన పరిమితమైందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మహాలక్ష్మి రూ.2500, పెన్షన్ రూ.4వేలు,రైతు బంధు రూ.15వేలు మరియు కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ఈ హామీల గురించి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ,మున్సిపాలిటీకి ఉన్న స్వయం ప్రతిపత్తిని ఉపయోగించి కేంద్ర నిధులతో పెద్దపల్లిని ఒక స్మార్ట్ సిటీగా, సుందరవనంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.ఈ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలుపుతున్నారని, త్వరలోనే ఆమె పెద్దపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు.ఈ సందర్భంగా వివిధ వార్డుల్లో పోటీ చేస్తున్న 26 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.వారిలో 2వ వార్డు ములుమూరి కావేరి-శేఖర్, 3వ వార్డు కుక్క మల్లేష్,4వ వార్డు ఆడెపు సుధాకర్,5వ వార్డు తాండ్ర మహేష్,6వ వార్డు కుంభం-సునీత సంతోష్,8వ వార్డు కుక్క భారతి,9వ వార్డు నదీమ్,10వ వార్డు పెర్క పూజ, 12వ వార్డు గులాం ఖాజా పాషా,13వ వార్డు సల్వాజి తిరుమలరావు,14వ వార్డు సాబీర్ ఖాన్, 15వ వార్డు కొలిపాక శ్రీనివాస్,17వ వార్డు కొలిపాక చిరంజీవి,18వ వార్డు కొలిపాక సంపత్,20వ వార్డు గణపతి-నిర్మల, 21వ వార్డు బండారి సుమన్ గౌడ్, 23వ వార్డు జడల సురేందర్,25వ వార్డు కుక్క జ్యోతి-కనకరాజు,26వ వార్డు కుక్క శ్రావణ్ కుమార్,29వ వార్డు వేల్పుల రజిత-రాజు యాదవ్, 30వ వార్డు ముక్సుదా బేగం,32వ వార్డు మర్రిపల్లి జలజ-సతీష్,33వ వార్డు గంగుల సంధ్యారాణి-సతీష్, 34వ వార్డు జమీరుద్దీన్,36వ వార్డు రయిసా తబస్సుమ్ లు ఉన్నారు. సింహం గుర్తుపై ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో జాగృతి రాష్ట్ర నాయకుడు బండారి శ్రీనివాస్ తోపాటు వివిధ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు