అభివృద్ధి శూన్యం.. శిలాఫలకాలే ప్రామాణ్యం
పూరపోరు రంగంలోకి 26 మంది సింహాలు ఫార్వర్డ్ బ్లాక్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ నవగీతం,పెద్దపల్లి: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి భవిష్యత్తును మార్చే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ,అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెద్దపల్లిలో అధికార పార్టీ తప్పులను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు,తమ స్వలాభం...