navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 2:14 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది

నవగీతం,కోరుట్ల:

కోరుట్ల మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. బిజెపి బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఆ ఓటు చెత్తబుట్టలో వేసినట్లేదని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు కోరుట్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల పట్టణంలోని పలు కార్నర్ మీటింగ్లలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందన్నారు. మనం ఏ పని చేయాలన్నా చేతితోనే కాబట్టి మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి మీ చేతులతో తమ చేతులు కలపాలన్నారు.

ఢిల్లీలో రాహుల్ గాంధీ హైదరాబాదులో రేవంత్ రెడ్డి కోరుట్ల నియోజకవర్గం లో జువ్వాడి నర్సింగ్ రావు లు పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమ కోసం కృషి చేస్తున్నారని కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కోరుట్ల మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి అత్యధిక నిధులు ఇప్పించే బాధ్యత నాదేనన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమ కోసం అహర్నిశలు కృషి చేస్తుందని అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసిడింగ్ పత్రాలు అందజేయడం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలు కూడా కడుపునిండా తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

తెలంగాణలోని 33 జిల్లాల్లో 120 మున్సిపాలిటీలు కార్పొరేషన్ లకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో కోరుట్ల నియోజకవర్గంలో చేసింది శూన్యమన్నారు ఇటీవలే కోరుట్ల నియోజకవర్గానికి 18 కోట్ల 70 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని అట్టి నిధుల ద్వారా సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద మధ్యతరగతి ప్రజలకు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 13 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాకుండా మూడు కోట్ల 17 లక్షల మందికి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియాని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70 వేల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు ఇరిగేషన్ సివిల్ సప్లై విషయంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని అందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ప్రోసిడింగ్ పత్రాలు అందజేయడం రేషన్ కార్డులు అందజేయడం జరిగిందని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి మరిన్ని నిధులు సమకూర్చి మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే అది కేవలం స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు చేసిన అభివృద్ధి తప్ప గడచిన పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు కోరుట్ల పట్టణ అటుచివరణ వెటర్నరీ కాలేజ్ ఎటు చివరన పాలిటెక్నిక్ కళాశాల ఫిల్టర్ బెడ్ నిర్మాణం త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేశారని అలాగే కోరుట్ల పట్టణంలో అత్యధికంగా 4500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసిన ఘనత స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు కే దక్కుతుందన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 70 ఇండ్లు మాత్రమే నిర్మించి అందులో 10 ఇండ్లను అమ్ముకుందని అన్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 600 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడం జరిగిందని ఇంకా ఇల్లు రాని వారు ఎవరైనా ఉంటే ఎన్నికల ముగిసాక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తామని అరేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే కోరుట్ల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు అనంతరం జువ్వాడి కృష్ణారావు  మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఎకిన్ పూర్ లో నిర్మించిన బ్రిడ్జి కూలిపోవడమే కాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు కోరుట్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అంటే అది కేవలం స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు చేసిన అభివృద్ధి తప్ప గడచిన పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదని కేవలం కల్లబొల్లి మాటలతో కాలం వెల్లదీసిందే తప్ప ప్రజా అభివృద్ధి సంక్షేమంపై ఏనాడు దృష్టి సారించలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజంగి నందయ్య . కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగ్ రావు  కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు  కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ఆయా వార్డుల ప్రజలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.