navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 12:00 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అయ్యా కలెక్టర్ గారు.. స్పందించండి

విద్యాశాఖ, ఆర్టిఏ అధికారులు చర్యలు తీసుకోండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డ్రైవర్ అన్న సందేశం

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ దోసరాజు సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేశారు.. జిల్లా కలెక్టర్..ఆర్టీఏ , విద్యాశాఖ అధికారులకు నమస్కరించి అయ్యా.. ఈ మధ్యకాలంలో పాఠశాల వాహనాలు అనేక ప్రాంతాలలో ప్రమాదాలకు గురి అవుతున్నవి. ఈ మధ్యనే మా మల్లాపూర్ మండలంలో రెండు సంఘటనలు జరిగినవి దీనికి మొదటి కారణం డ్రైవర్ నిర్లక్ష్యం, రెండవది పాఠశాల యజమాన్యాలు సరియైన డ్రైవర్లను ఎంచుకోకపోవడం… అయ్యా పాఠశాల యజమాన్యాలు మీరు సరియైన డ్రైవర్ ని ఎంచుకొని డ్రైవర్ కి నియమ నిబంధనలు పాటించేలా ఆదేశించి వారికి సరియైన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదో లేదో తెలుసుకొని యువకులని కాకుండా ఓపిక సహనం ఉన్న వారిని డ్రైవరుగా పెట్టుకుంటే మంచిది. నాతోటి డ్రైవర్లు మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. పాఠశాల వాహనం ఏది అయినా సరే మీరు కేవలం ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే డ్రైవింగ్ చేసుడు కాబట్టి అట్టి ఒక్క ట్రిప్ కి మీరు అంతలా ఓపిక లేకుండా నడిపితే ఎలా అలాగే పాఠశాల యాజమాన్యం ముందుగా డ్రైవర్ డ్యూటీకి రాగానే వారి సెల్ ఫోన్ తీసుకోని డ్యూటీకి పంపగలరు. అని ఇట్టి ప్రమాదాల దృష్ట్యా కలెక్టర్  విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకొని సరైన డ్రైవర్లను ఎంచుకోవాలని కోరారు. దయచేసి నాతోటి డ్రైవర్స్ తప్పుగా భావించకండి అని తన సందేశంలో తెలిపారు.