సబ్సిడీపై ఆయిల్ పామ్ మొక్కలు, డ్రిప్పుకు దరఖాస్తు చేసుకోండి
నవగీతం, మల్లాపూర్:
అత్యధిక నూనే దిగిబడినీ ఇస్తున్న ఆయిల్ పామ్ పంటను రైతులు పండించి అధిక లాభాలను అర్జించాలని ఆయిల్ పామ్ ఏరియా మేనేజర్ వనోజ్ రెడ్డి అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ లో భాగంగా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో రైతులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులైనా నేల తయారీ, ఎరువుల యాజమాన్యం , కలుపు నివారణ మొక్కజొన్నలో పోషక లోపాలు వాటి యాజమాన్యం పురుగుల తెగులు లక్షణాలు వాటి సమగ్ర యాజమాన్యం రైతులకు వివరించారు.

ఆయిల్ పామ్ ఏరియా మేనేజర్ మానోజ్ రెడ్డి మాట్లాడుతూ ఆయిల్ పామ్ ప్రపంచంలో కెల్లా అత్యధిక నూనే దిగిబడినీ ఇస్తున్న పంట ను వేసి రైతులు లాభాలను అర్జించాలని ఇది సంవత్సరానికి నాలుగు నుంచి ఆరు టన్నుల నూనె దిగుబడి ఇవ్వగలిగి ప్రపంచం మొత్తం వంటనూనెల ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర సంతరించుకున్నది.ఆయిల్ పామ్ పండు యొక్క పీచు భాగం నుండి పామాయిల్ , గింజల నుండి కెర్నల్ నూనె తీస్తారు. ఈ పంటకు 90 శాతం సబ్సిడీ పైన మొక్కలు, డ్రిప్పు అందుబాటులో ఉన్నాయి కావున ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ శ్రీలత వద్ద దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు. దరఖాస్తు కావల్సిన పత్రాలు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం , పట్టాదారు పాసు పుస్తకం, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, ఇవి డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలను ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి లావణ్య వ్యవసాయ విస్తరణ అధికారి వంశీ గజానంద్ సర్పంచ్ డప్పుల పద్మ మార్కెట్ చైర్మన్ అంతడుపుల పుష్పలత గ్రామపంచాయతీ సెక్రటరీ నారాయణరెడ్డి రైతులు అంతడ్పుల నర్సయ్య డప్పుల నర్సయ్య గంగాధర్ మల్లేశ్ వేణు సంతోష్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
