ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు కృత్రిమ మేధస్సుతో సాధ్యం
నవగీతం, కరీంనగర్: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం యూనివర్సిటీ సెమినార్ హల్ లో "భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు యొక్క ప్రభావం "అనే అంశంపై రెండు రోజుల జాతీయస్థాయి సదస్సు అట్టహసంగా ప్రారంభమైనది. జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రొ.సతీష్ కుమార్, రిజిస్టార్ , శాతవాహన విశ్వవిద్యాలయం, సదస్సు కిలకోపన్యాసలు ప్రొ. చిట్టేడి కృష్ణారెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, వి. సి. ఓ ఎస్ డి డాక్టర్. డి హరికాంత్, ఆర్ట్స్ అండ్ లా...