navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 12:33 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం

నవగీతం,వెల్గటూర్:

వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వారి ప్రాణంగంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.అంతకు ముందు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రతి పౌర్ణమి కి ఆలయంలో ఒకరు అన్నదానం నిర్వహించేవారు. ఈ పౌర్ణమి కి అన్నదాతలు ఎవరు లేకపోవడంతో ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ ప్రత్యేక చోరువ తో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.దీంతో భక్తులు, గ్రామ ప్రజలు అన్నదాన కార్యక్రమం ఎత్తివేయకుండా నిర్వహించినందుకు సంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్,గుమ్ముల అజయ్,సాగాని శ్రీనివాస్, సంకోజు సురేష్,కొప్పుల ప్రవీణ్, పందిరి వెంకటేష్, ఆలయ అర్చకులు నరసింహస్వామి,గ్రామ యువకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.