navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 8:35 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఆలయ దొంగతనం కేసులో భార్యభర్తల అరెస్ట్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరూర్ క్యాంప్‌లో ఉన్న కోదండ రామాలయంలో ఈనెల 3న అర్ధరాత్రి ఆలయ తాళం పగలగొట్టి దేవుడికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు, హుండీలోని నగదును దొంగిలించిన జగిత్యాల రూరల్ మండలం తాటిపెళ్లి గ్రామానికి చెందిన వడ్లూరి నాగరాజు, వడ్లూరి రజితలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.4,357/- నగదుతో పాటు దేవుడికి సంబంధించిన బంగారు మరియు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆస్తుల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 100కు సమాచారం అందించాలని ఆయన కోరారు.