ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ బి.సత్య ప్రసాద్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ...మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిర్మించుకునే ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తుందని తెలిపారు. ఇటుక, కంకర, బేస్మెంట్ పై ధరల నియంత్రణ ఇండ్లు లబ్ధిదారులకు...