జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 16న రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ శనివారం తెలిపారు. రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్ ముగిసే వరకు ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఉండదని, ఆ తర్వాతే యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మార్పును జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.