navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 5:49 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎండీ యాసిన్ ,బిస్మిల్లా

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

మెట్ పల్లి ఐక్యూమైండ్స్ ఆధ్వర్యంలో ఈనెల 12, 13 తేదీలలో ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐక్యూమైండ్స్ నిర్వాహకులు ఎండీ యాసీన్, బిస్మిల్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్య పూర్తి చేసిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 12, 500/- నుండి రూ.20,000 వరకు ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల మహిళలు,యువత మెట్ పల్లి ఐక్యూమైండ్స్ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు మెట్ పల్లి ఐక్యూమైండ్స్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.