navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 1:34 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలి

ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి :

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ శుక్రవారం జగిత్యాల పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 1, 2, 26 వార్డులు, ఇతర ప్రాంతాలను ఆయన పరిశీలించారు.విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన అనధికార ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. పబ్లిక్ ప్రాపర్టీపై ఉన్న ప్రచార సామాగ్రిని మునిసిపల్ సిబ్బందితో తొలగింపజేశారు. పబ్లిక్ స్థలాల్లో ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఉన్న ప్రచారాలను గుర్తించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు చేయాలని సూచించారు. ప్రచార ఖర్చులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. పర్యవేక్షణ బృందాలు సమన్వయంతో పనిచేయాలని సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని అన్నారు.