ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలి

ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ శుక్రవారం జగిత్యాల పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 1, 2, 26 వార్డులు, ఇతర ప్రాంతాలను ఆయన పరిశీలించారు.విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన అనధికార ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. పబ్లిక్ ప్రాపర్టీపై ఉన్న ప్రచార సామాగ్రిని మునిసిపల్ సిబ్బందితో తొలగింపజేశారు....