ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలి
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, మున్సిపల్ ఎన్నికలు ఉన్న పోలీస్ స్టేషన్‌లకు చెందిన ఎస్‌ఐలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణలో పోలీస్ శాఖ పాత్ర, ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠిన అమలు, పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టవలసిన...