నవగీతం, మల్యాల :
మల్యాల మండల కేంద్రంలోని ఎస్‌జీఆర్ స్కూల్ విద్యార్థులు కరాటే పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 25 మెడల్స్ సాధించారు. ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న విద్యార్థులు 8 బంగారు, 6 వెండి, 11 కాంస్య పతకాలను గెలుచుకుని పాఠశాలకు కీర్తి తీసుకువచ్చారు. బంగారు పతకాలు సాధించిన వారిలో సాఫియా, వందిత, రిషి వర్ధన్, లక్ష్మీ సాహిత్య, హర్వమ్, యూనస్, అమరేందర్, సారిక ఉన్నారు. వెండి పతకాలు సాధించిన వారిలో కార్తికేయన్, ఇజెన్ రిషీశ్వర్, మోహరాజ్, హఫీజ్, మనుశ్రీ తదితరులు ప్రతిభ చాటారు. కాంస్య పతకాలు సాధించిన వారిలో నిత్యశ్రీ, సందన్ శౌర్య, అవినాష్, రిష్వంత్, నవనీత్, మనస్విని, తనీష్మ, చేతన సహస్త్ర, రేణ, శశాంక్ తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా శనివారం మల్యాల స్థానిక సర్పంచ్ బొట్ల జయప్రసాద్ చేతుల మీదుగా విజేతలకు మెడల్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అనిల్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, పట్టుదల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అభినందించారు. కరాటే మాస్టర్ బరిగే లక్ష్మీరాజ్యం శిక్షణతో విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని తెలిపారు.విద్యార్థుల విజయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.