navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 1:14 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఏఐఎఫ్‌బి జిల్లా కన్వీనర్‌గా కొలిపాక శ్రీనివాస్

నవగీతం, పెద్దపల్లి:

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెద్దపల్లి జిల్లా నూతన కన్వీనర్‌గా కొలిపాక శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు.పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు,నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా జోజి రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని మండల,పట్టణ మరియు గ్రామ స్థాయి కమిటీలను తక్షణమే సమన్వయం చేసుకుంటూ,పార్టీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని శ్రీనివాస్‌ను ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్ర కమిటీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా,జిల్లాలో పార్టీ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతన కన్వీనర్ కొలిపాక శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రకటించారు.యువత,మహిళలు మరియు అణగారిన వర్గాలను పార్టీ వైపు ఆకర్షించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తానని,సమిష్టి నిర్ణయాలతో జిల్లాలో ఫార్వర్డ్ బ్లాక్ జెండాను రెపరెపలాడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.శ్రీనివాస్ నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ,ఆయన నాయకత్వంలో జిల్లాలో పార్టీకి కొత్త ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.