ఏఐఎఫ్‌బి జిల్లా కన్వీనర్‌గా కొలిపాక శ్రీనివాస్

నవగీతం, పెద్దపల్లి: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెద్దపల్లి జిల్లా నూతన కన్వీనర్‌గా కొలిపాక శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు.పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు,నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా జోజి రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని మండల,పట్టణ మరియు గ్రామ స్థాయి కమిటీలను తక్షణమే సమన్వయం చేసుకుంటూ,పార్టీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని శ్రీనివాస్‌ను...