ఒంటరి పోరాటంతో అఖండ విజయం

పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన వెన్నం సుజాత-రవీందర్ గెలుపు నవగీతం, పెద్దపల్లి: పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నం సుజాత- రవీందర్ అద్భుత విజయాన్ని అందుకున్నారు.గతంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడినప్పటికీ, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈసారి 6వ వార్డు నుండి తన సతీమణిని బరిలోకి దింపిన బీఆర్ఎస్ నాయకుడు వెన్నం రవీందర్,తన రాజకీయ చాతుర్యాన్ని చాటుకున్నారు. చిత్రమేమిటంటే, ప్రచార పర్వంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,మాజీ మున్సిపల్...