నవగీతం, మెట్ పల్లి టౌన్:
మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా మెట్ పల్లిలో జరిగిన పోలింగ్ లో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని 24వ వార్డులో ఏర్పాటు చేసిన 68వ పోలింగ్ బూత్ లో ఓటు వేసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారన్న నమ్మకం ఉందన్నారు.