నవగీతం,కోడీమ్యాల:
కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన 24 మంది పరిశుద్ధ కార్మికులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దుప్పట్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పరిశుద్ధ కార్మికులు సంతోషంగా, భద్రంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా జి ఎస్ ఆర్ చారిటబుల్ ఫౌండేషన్ తరపున భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుర్రం నర్సయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ రెడ్డి, నాయకులు గుర్రం ప్రవీణ్, చొక్కాల నాగార్జున, రంజిత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.