కీసరగుట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

నవగీతం,మల్కాజిగిరి: కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవా లలో విఐపి దర్శనాలతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుండి నుంచి 18 వరకు జరగనున్న నేపథ్యంలో సోమవారం కీసర గుట్టకు వెళ్ళిన కలెక్టర్ మన చౌదరి, మల్కాజిగిరి డిసిపి శ్రీధర్, ట్రాఫిక్ డిసిపి రాహుల్ రెడ్డి, ఆర్డిఓ రాజేష్, ఆలయ కమిటీ చైర్మన్ తటాకం వెంకటేశ్,...