navageetam.com
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 5:41 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చేనేత రంగానికి ఘోర అన్యాయం:

కె.బి -రామ్మోహన్ పద్మశాలి

నవగీతం,మంచిర్యాల:

సోమవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశానికి గర్వకారణమైన చేనేత రంగానికి ఇచ్చిన కేటాయింపులు తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురిచేసిందని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ బత్తిని రామ్మోహన్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. లక్షలాది చేనేత కుటుంబాల జీవనాధారమైన ఈ కళారంగానికి కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించడం అనేది చేనేతల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అవమానానికి నిదర్శనం. ఈ బడ్జెట్ పై తీవ్ర నిరసన గళం వినిపిస్తున్నాం. ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్ అని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు స్వదేశీ కళలకు ప్రాణమైన చేనేత రంగాన్ని పక్కన పెట్టడం దారుణం. గతంలో ఆల్ ఇండియా హాండ్లూమ్ బోర్డు, సెరిపెడ్ బోర్డులను రద్దు చేసి చేనేత రంగాన్ని మరింత బలహీన పరిచిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పటికైనా తన తప్పును సరిదిద్దుకోవాలి.వెంటనే ఆ బోర్డులను పునరుద్ధరించాలి.చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు అది ఒక సంస్కృతి, ఒక చరిత్ర, కోట్లాది చేతులకు ఉపాధి.అలాంటి రంగానికి ఈ స్థాయి కేటాయింపులు చేయడం అంటే చేనేత కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడటమే. అందువల్ల, బడ్జెట్లో తక్షణమే సవరణ చేసి చేనేత రంగానికి కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలని చేనేతలకు రక్షణ మార్కెటింగ్, ముడిసరకుల సబ్సిడీలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని దృఢంగా డిమాండ్ చేస్తున్నాం చేనేతను కాపాడండి చేనేత కార్మికుల భవిష్యత్తును నిలబెట్టండి.